AP: రాష్ట్రవ్యాప్తంగా శనివారం రా.8.30 నుంచి 9.30 గంటల వరకు ప్రజలందరూ ఇళ్లలో లైట్లు ఆపేసి ‘ఎర్త్ అవర్’ పాటించాలని గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. ‘వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్’ అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఎర్త్ అవర్‌కు రాష్ట్ర ప్రజలందరూ సహకరించాలని కోరారు. వాతావరణ పరిరక్షణ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.