ఎర్త్ అవర్.. గంట సేపు లైట్లు బంద్!

69చూసినవారు
ఎర్త్ అవర్.. గంట సేపు లైట్లు బంద్!
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది మార్చి 22న ఎర్త్ అవర్ జరుపుతుంటారు. ఆ రోజు రాత్రి 8.30 నుంచి 9.30 గంటల మధ్యలో విద్యుత్ లైట్లను ఆపేస్తారు. పర్యావరణ పరిరక్షణకు, భూతలతాపాన్ని నియంత్రించేందుకు ఈరోజును ప్రారంభించారు. ఎర్త్ డేను పాటిస్తూ తెలంగాణ ప్రభుత్వం సచివాలయంలో శనివారం రాత్రి గంట సేపు లైట్లను ఆపేయనుంది. ప్రజలు స్వచ్ఛందంగా లైట్లు ఆపి ఎర్త్ అవర్ పాటించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.