వాట్సప్ ప్రతీ రాత్రి యూజర్ డేటాను ఎక్స్‌పోర్ట్ చేస్తుందంటూ టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పేర్కొనడం చర్చనీయాంశమయ్యింది. వీటిని వాట్సప్ అధినేత విల్ క్యాత్‌కార్ట్ తోసిపుచ్చారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఎంతోమంది చెప్పారని, మళ్లీ పునరావృతం చేయడం వల్ల ఉపయోగం లేదన్నారు. 'భద్రత అంశాన్ని వాట్సప్ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అందుకే మీ మెసేజ్‌లను ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేస్తాం' అని చెప్పారు.