ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2,476

54చూసినవారు
ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2,476
AP: సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర రూ.825.50 (విజయవాడలో)గా ఉంది. ఏడాదికి మూడు సిలిండర్ల లెక్కన ప్రస్తుతమున్న వంటగ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంటగ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్లకార్డు ప్రాతిపదికగా తీసుకుంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి.

సంబంధిత పోస్ట్