దేశంలోనే తొలిసారిగా ఎయిర్ ఇండియా తమ విమాన సర్వీసుల్లో వైఫై సేవలు ప్రారంభించింది. దేశీయంగా ఈ సేవలు ప్రస్తుతానికి ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ ఏ-350, బోయింగ్ 787-9, ఎయిర్ బస్ ఏ321 నియో ఎయిర్ క్రాఫ్టులలో ఈ సేవలు ప్రారంభమయ్యాయి. విమానం పదివేల అడుగులకు చేరాక ప్రయాణికులకు వైఫై సేవలు అందుతాయి.