శ్రీశైలం డ్యామ్ తెలంగాణ జల విద్యుత్ కేంద్రంలో (ఎడమ గట్టు) నీరు లీకేజ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వరుసగా పంప్ మోడ్ ఆపరేషన్ చేస్తుండటంతో బట్టర్ ఫ్లై వాల్వు వద్ద నీరు లీక్ అవుతున్నట్టు అధికారులు గుర్తించారు. అయితే, నీరు లీకేజీ కారణంగా డ్యామ్‌కు ఎటువంటి ప్రమాదం లేదని జెన్కో అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిపుణులతో చర్చించి నివేదికను రూపొందిస్తామని అధికారులు చెప్పారు.