ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ మంచం మీద 4 సింహం పిల్లలతో పడుకుని నిద్రపోతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఈ వీడియో కొంతకాలం క్రితం ఈ సింహం పిల్లల ప్రాణాలను కాపాడిన జంతు రక్షకురాలు ఫ్రెయా ఆస్పినాల్కు సంబంధించినది. ఇక ఈ పిల్లలను పెంచడం కోసం తను వాటికి తల్లిలా మారానని చెప్పింది. అందుకే వాటితోనే నిద్రపోతున్నట్టుగా చెప్పింది. వీటిని ఆఫ్రికాకు పంపాలని యోచిస్తోంది.