ఇజ్రాయిల్ శత్రు దేశాలపై దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సిరియాలో మరోసారి ఇజ్రాయెల్ దాడులు చేసింది. డమాస్కస్ లో హెజ్బొల్లాకు సంబంధించిన అపార్ట్మెంట్పై విరుచుకుపడింది. ఈ దాడిలో ఓ కమాండర్ తో సహా 9 మంది చనిపోయారని ఓ వార్ మానిటర్ వెల్లడించారు. లెబనీస్ పౌరసత్వం కలిగిన అతడు సిరియాలో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని తెలిపారు.