రోజూ ఉదయం పరగడుపునే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. జీర్ణాశయంలో మిగిలిపోయిన ఆహారం ఏదైనా ఉంటే.. త్వరగా జీర్ణమై కడుపు ఖాళీ అవుతుంది. ముఖ్యంగా అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. వెచ్చని నీళ్లు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత, రక్తంలో నీటి శాతం పెరుగుతుంది. శరీర కణాలకు ఆక్సిజన్, గ్లూకోజ్ సరఫరా మెరుగవుతుంది.