మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు

77చూసినవారు
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు మహిళా కమిషన్‌ నోటీసులు
మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు షాక్ తగిలింది. తెలంగాణ మహిళా కమిషన్‌ ఆయనకు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 24న కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ‘బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో వ్యాఖ్యానించడం వివాదాస్పదంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్