ఆరోగ్యం, అందం కోసం చాలామంది జిమ్‌కి వెళుతుంటారు. అయితే జిమ్‌లో వర్కవుట్స్ చేయాలంటే వదులుగా, సాగే లక్షణం ఉన్న ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. కానీ ఇక్కడ వైరలవుతోన్న వీడియోలో మాత్రం కొందరు మహిళలు సంప్రదాయ చీర కట్టులోనే వ్యాయామం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. వీరి వర్కవుట్స్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.