ప్రజలు ఏం కోల్పోయారో వాళ్లకు అర్ధం అయింది: కేసీఆర్
కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు పూర్తయిందని.. ప్రజలు ఏం కోల్పోయారో వాళ్లకు అర్థమైందని BRS అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వందశాతం BRS అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం పిచ్చి మాటలు మాట్లాడుతుంది. మళ్లీ BRS అధికారంలోకి వస్తుందని ప్రజలు చెబుతున్నారు. ప్రజలు మాపై విశ్వాసంతో ఉన్నారు. అందరూ కష్టపడి పని చేయాలి. అరెస్టులకు భయపడేది లేదు' అని అన్నారు.