సెల్‌టవర్‌ ఎక్కి యువకుడి హల్‌చల్‌

78చూసినవారు
సెల్‌ టవర్‌ ఎక్కి ఓ యువకుడు హల్‌ చల్‌ చేసిన ఘటన ఏపీలోని పల్నాడు జిల్లా క్రోసూరులో చోటు చేసుకుంది. క్రోసూరుకి చెందిన షేక్‌ మస్తాన్‌ వలి(22), సిరిపురం గ్రామానికి చెందిన యువతితో పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు అతడిని బెదిరించి, ఆమెను తీసుకెళ్లిపోయారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు సెల్‌టవర్‌ ఎక్కాడు. డీఎస్పీ హామీ ఇస్తేనే కిందకి దిగుతానని చెబుతున్నాడు.

సంబంధిత పోస్ట్