సంక్రాంతి తర్వాత జగన్ మాస్టర్ ప్లాన్.. ఈ సారి కొత్త స్లోగన్‌తో?
AP: సంక్రాంతి తర్వాత వైసీపీ అధినేత జగన్ మరో మాస్టర్ ప్లాన్‌తో ప్రజల ముందుకు రానున్నారు. ఇక నుంచి మీకోసం.. మీ వెంటే.. మీ జగన్ అన్న అంటూ కొత్త స్లోగన్‌తో సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. కష్ట పరిస్థితుల్లోనూ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఈ పర్యటనలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నట్లు జగన్ తెలిపారు. అయితే సొంత పార్టీలోనే జగన్‌కు వ్యతిరేకత మొదలైందని గుసగుసలు వినిపిస్తున్నాయి.