ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ.. 100 మంది మృతి!

73చూసినవారు
పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా అక్కడ రెండు వర్గాల అభిమానుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 100 మంది మృతిచెందారు. వారి మృతదేహాలు వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మ్యాచ్‌ మధ్యలో రిఫరీ వివాదాస్పద నిర్ణయంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది. దీంతో అభిమానులంతా మైదానంలోకి దూసుకెళ్లి గొడవ పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్