ఆ తల్లి కష్టం ఎవరికీ రావొద్దు.. హృదయవిదారక ఘటన

61చూసినవారు
ఆ తల్లి కష్టం ఎవరికీ రావొద్దు.. హృదయవిదారక ఘటన
తెలంగాణలోని ఖమ్మంకు చెందిన రాజు, ఏపీలోని నర్సీపట్నానికి చెందిన ప్రసాద్ కిష్టాపురంలోని సింగరేణిలో పని చేస్తుంటారు. ఆదివారం ఇరు కుటుంబాలు కలిసి తిరుపతి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో సత్తుపల్లి వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా.. వేగంగా వచ్చిన లారీ వీరిపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో రాజు కుమారుడు యశ్వంత్ అక్కడే మృతి చెందగా.. ప్రసాద్ కుమార్తె నిహితకు గాయాలయ్యాయి. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు కళ్ల ముందే మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్