నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ శనివారం పులివెందుల వెళ్లనున్నారు. వైసీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి వైఎస్ అభిషేక్ రెడ్డి (36) అంత్యక్రియలకు హాజరుకానున్నారు. పులివెందులలోని వైఎస్ కుటుంబ సభ్యుల సమాధుల తోటలో అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. కాగా, జగన్ పెద్ద నాన్న వైఎస్ ప్రకాశ్ రెడ్డి మనవడు అభిషేక్ రెడ్డి. జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఏఐజీ ఆస్పత్రిలో అభిషేక్ రెడ్డి కన్నుమూశారు.