ఈ బంగారు తేనీరు ధర తెలిస్తే షాకవుతారు!

62చూసినవారు
ఈ బంగారు తేనీరు ధర తెలిస్తే షాకవుతారు!
ప్రపంచంలో తేయాకు రకాలు ఎన్నో ఉన్నాయి. వాటి నాణ్యతను బట్టి వాటి ధరలు ఉంటుంది. అయితే సింగపూర్‌లోని టిడబ్ల్యూజీ కంపెనీ బంగారు తేయాకు విక్రయిస్తోంది. ప్రస్తుతం దీని ధర కిలో 12,830 డాలర్లు(రూ.10.70 లక్షలు). నాణ్యమైన తేయాకులను పొడవుగా కత్తిరించి, ఆరబెట్టిన తర్వాత ఆ తేయాకులకు 24 క్యారెట్ల బంగారు పూత పూసి కళ్లు చెదిరే ప్యాకింగ్‌తో అందిస్తోంది. దీంతో చేసిన తేనీరు బంగారు రంగులో ధగధగలాడుతోంది.