సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువతి ఏకంగా ఎలుగుబంటితో ఫొటో షూట్ ప్లాన్ చేసింది. గడ్డిలో ఉన్న ఓ భారీ ఎలుగుబంటి వద్దకు ఓ యువతి వెళ్లి.. ఏకంగా దాన్ని కౌగిలించుకుంటుంది. ఎలుగుబంటి కూడా యువతిని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటుంది. అంతటితో ఆగని ఆ యువతి ఎలుగుబంటికి యాపిల్ పండు తినిపిస్తుంది. పండు తిన్న ఎలుగుంటి.. యువతికి ముద్దులు పెడుతూ థ్యాంక్స్ కూడా చెబుతుంది.