తన తల్లికి సరైన వైద్యం అందించలేదంటూ ఓ యువకుడు ప్రభుత్వ వైద్యుడిపై కత్తితో ఏడు సార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటన చెన్నైలోని గిండీ ప్రాంతంలోని ఆసుపత్రిలో చోటుచేసుకుంది. గత కొన్ని నెలలుగా యువకుడు తన తల్లికి క్యాన్సర్ వైద్యం చేయించాడు. కానీ, ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో డాక్టర్ బాలాజీ జగన్నాథన్‌పై కక్ష పెంచుకుని దాడికి పాల్పడ్డాడు. వైద్య సిబ్బంది నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.