AP: అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై కేసులు పెడితే తప్పేముందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. సోషల్ మీడియా కార్యకర్తలపై మూకుమ్మడిగా కేసులు పెడుతున్నారని విజయబాబు అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. కేసులపై అభ్యంతరాలుంటే నేరుగా కోర్టును ఆశ్రయించాలని చెప్పింది. పిల్ వేయడానికి వీలు లేదని పేర్కొంది.