TG: ఓ వృద్ధుడిపై యువకుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణం బాపూజీనగర్ లో జరిగింది. బాపూజీ నగర్ చెందిన మాలకొండయ్య అనే వృద్ధుడు దాదాపు 40 ఏళ్లుగా సిమెంట్ రింగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మంగళవారం రాత్రి ఎప్పటిలాగే దుకాణం మూసేసి ఇంటికి వెళ్తున్న సమయంలో వసీం అక్రం అనే యువకుడు కత్తితో కొండయ్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో కొండయ్యకు తీవ్ర గాయాలయ్యాయి.