తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. 2 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ములుగు కేంద్రంగా అత్యధికంగా రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తొలిసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని ప్రజలు చెబుతున్నారు.