సౌత్ కొరియాలో ఏర్పడ్డ సంక్షోభంతో మంగళవారం ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. దీంతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో యూన్ సుక్ యోల్ వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో సౌత్ కొరియాలో చోటు చేసుకుంటున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నామని అమెరికా పేర్కొంది. యూఎస్, ఆర్వోకే కూటమికి తమ మద్దతు కొనసాగుతుందని వెల్లడించింది.