శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బుధవారం పీఎస్ఎల్వీ సీ-59 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. సాయంత్రం 4.06 గంటలకు ఇస్రో రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా-3 శాటిలైట్‌ను నింగిలోకి చేర్చనున్నారు. ఇవే కాకుండా మరో నాలుగు ఉపగ్రహాలు కూడా అంతరిక్షంలోకి పంపుతున్నారు. భూమి నుంచి దాదాపు 60 వేల కి.మీ ఎత్తున ఉపగ్రహాలను ప్రవేశపెడుతున్నారు.