మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాలో గోవర్ధన పూజను ఘనంగా నిర్వహించారు. మహాకాళేశ్వర్ నగరం ఉజ్జయిని నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్‌నగర్ తహసీల్‌లోని భిదావద్ గ్రామంలో గోవర్ధన్ పూజలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం అనుసరించబడుతుంది. నేలపై పడుకున్న వ్యక్తులపైకి ఆవులు నడుస్తాయి. ఆవులు తమను తొక్కుతూ వెళ్లిన కాసేపటికే యువకులు పైకి లేచి డాన్సులు చేశారు. దీపావళి తర్వాతి రోజు ఈ వేడుకను జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.