
ఓటమి లేకుండా ట్రోఫీ అందుకున్న భారత్
2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ సమష్టి కృషితో మరో ఐసీసీ ట్రోఫీ సొంతం చేసుకుంది. ఎవరో ఒకరిపై ఆధారపడకుండా జట్టులోని 11 మంది ప్లేయర్లు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. లీగ్ స్టేజీ, సెమీఫైనల్, ఫైనల్ ఇలా ప్రతి రౌండ్లో ఒక్క పరాజయం లేకుండా కప్పు ఎగరేసుకుపోయింది. 2002లో, 2013లోనూ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకుంది. ఇలా మూడు ఛాంపియన్స్ ట్రోఫీలను గెలుచుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.