TG: సభ వాయిదా పడిన అనంతరం.. శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబును బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. సభలో జరిగిన గందరగోళంపై చర్చించారు. అయితే వ్యాఖ్యలు సభా ఉల్లంఘనే అవుతుందని, ఆయనచేత స్పీకర్‌కు క్షమాపణలు చెప్పించాలని శ్రీధరాబాబు వాళ్లకు సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు.. హరీశ్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను విడిగా కలిశారు. జగదీశ్ చేసిన వ్యాఖ్యల రికార్డును పరిశీలించాలని కోరారు.