విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్టు మేయర్ గొలగాని హరివెంకట కుమారి మంగళవారం తెలిపారు. మంగళవారం జరిగిన సమావేశంలో కూటమి సభ్యులు అజెండాలో అంశాలు చర్చించకుండా సభను పక్కదారి పట్టించారని, ఈ నేపథ్యంలో సభను బుధవారం నాటికి వాయిదా వేశామని చెప్పారు. సభ్యులు సహకరిస్తే విశాఖ అభివృద్ధిపై చర్చించే అవకాశం ఉంటుందన్నారు.