పరవాడ: తాడి గ్రామాన్ని తక్షణం తరలించాలి

కాలుష్యానికి గురైన పరవాడ మండలం తాడి గ్రామాన్ని వెంటనే అక్కడి నుంచి తరలించాలని సీఐటీయూ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం పరవాడలో ఆయన మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమల కాలుష్యానికి గ్రామస్థులు తీవ్ర అనారోగ్యానికి గురై పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. గ్రామాన్ని తరలించడానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్