అద్దంకి: స్కూటీ అపహరణ పై కేసు నమోదు

అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన దేవరపు వెంకట్రావు తన స్కూటీ అపహరణకు గురైందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణయ్య తెలియజేశారు. బాధితుడు ఈనెల రెండో తేదీన తిమ్మాయపాలెం లో ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద స్కూటీని ఉంచి బేల్దారి పనికి వెళ్లి ముగించుకొని రాగా స్కూటీ కనపడలేదని ఫిర్యాదు లో పేర్కొన్నట్లు చెప్పారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్