అద్దంకి పట్టణంలో మెగా జాబ్ మేళా

అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి.రవికుమార్ సహకారంతో, అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ - 29న స్థానిక ఆర్ అండ్ బి బంగ్లా నందు, మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అసిస్ట్ సంస్థ సెక్రటరీ జాస్తి కృష్ణ శుక్రవారం తెలియజేశారు. అందుకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. జాబ్ మేళాలో 25 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారని, 10 వ తరగతి నుండి డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు అవుతారని తెలిపారు.

సంబంధిత పోస్ట్