చిలకలూరిపేట: శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్: ఎమ్మెల్యే

శవ రాజకీయాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. ఆదివారం చిలకలూరిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కుటుంబం విషాదంలో ఉంటే తమ్ముడిని తొక్కేశాడని, కుటుంబంలో వివాదం ఉందని జగన్ మీడియా వార్తలు రాయటం దారుణమన్నారు. సొంత మనుషులను రాజకీయంగా వాడుకొని ఎలా వదిలేయాలో జగన్ కు తెలిసినట్లు ఎవరికీ తెలియదు అన్నారు. ముందు తల్లి, చెల్లికి సమాధానం చెప్పాలన్నారు.

సంబంధిత పోస్ట్