చిలకలూరిపేట: మాజీ ముఖ్యమంత్రి జగన్ పై ఎమ్మెల్యే విమర్శలు

అసెంబ్లీలో జలవనరుల శాఖపై మంగళవారం జరిగిన చర్చలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. 'కమీషన్ల కోసం జగన్ రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చారు. పోలవరం, వెలిగొండ సహా అన్ని ప్రాజెక్టులను మూలన పడేశారు. ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. రాష్ట్రంలో జలకళ పోయి, కరువు బయటపడుతున్నా జగన్ ఏమాత్రం పట్టించుకోలేదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చెరువుల అనుసంధానం, చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్