జీఎంసీ పరిధిలోని డ్రైన్ల ఆక్రమణల తొలగింపు విషయంలో రాజీ లేదని గుంటూరు జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. కొరిటెపాడు పార్క్ వెనుక డ్రైన్, రోడ్ ఆక్రమణలను సోమవారం నుంచి తొలగించడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కొరిటెపాడు, విద్యానగర్ మెయిన్ రోడ్లలో శనివారం కమిషనర్ పర్యటించి, ఆక్రమణల తొలగింపుపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.