గుంటూరు ఎన్టీఆర్ బస్టాండ్ లో నీటి తొలగింపు

గుంటూరులోని ఎన్టీఆర్ బస్టాండ్ ఆదివారం జలదిగ్బంధంలో మునిగిపోయింది. బస్సులన్నీ లోపల ఉండి సగం మునిగిపోయి బయటకి రాలేనటువంటి పరిస్థితి నెలకొంది. ప్రయాణికులు ఎటు వెళ్లలేక పోతున్నారు. నిల్వ ఉన్న నీళ్లను రాష్ట్ర విపత్తు స్పందన శాఖ వారు పెద్ద మోటర్ల ద్వారా నీటిని తోడుతున్నారు. ఈ నీటిని పెద్ద డ్రైనేజీలోకి వదులుతున్నారు. బస్టాండు లోపల చుట్టుప్రక్కల మొత్తం ఆరు మోటర్లతో నీటిని తోడే చర్యలు అధికారులు చేపట్టారు.

సంబంధిత పోస్ట్