ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ రద్దు: కమిషనర్

ఈనెల 16వ తేదీన సోమవారం జీఎంసీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ తాత్కాలికంగా రద్దు చేశారు. సోమవారం మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా జీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థని రద్దు చేస్తున్నట్లు గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

సంబంధిత పోస్ట్