ప్రజలపై భారాలు మోపే విద్యుత్ సంస్కరణలను ఆపాలని, విద్యుత్ ఛార్జీల పెంపు నిలిపివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరు శంకర్ విలాస్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. అజయ్ కుమార్ మాట్లాడుతూ నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటింటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం మోపటం సమంజసం కాదన్నారు. మాల్యాద్రి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.