మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఎటువంటి పార్టీ మారటం లేదని ఆమె భర్త దయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం గుంటూర్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. రాజకీయాల్లో కొనసాగినంత కాలం రాజశేఖర్ రెడ్డి దీవెనలతో జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తామని దీంట్లో ఎటువంటి మార్పు ఉండదన్నారు. వైసీపీ క్యాడర్లో గందరగోళాన్ని సృష్టించాలని కొన్ని మీడియా ఛానళ్లు తమ కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ప్రజలు నమ్మవద్దని కోరారు.