గుంటూరు: తల్లి కనిపించడం లేదని కుమారుడు ఫిర్యాదు

తల్లి కనిపించడం లేదని కుమారుడు నగరంపాలెం పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాల మేరకు గుంటూరు శ్రీనివాసరావు పేటకు చెందిన వినయ్ తన ఖర్చులకు డబ్బులు కావాలని తల్లి మాధవిని కోరాడు. ఆమె తన వద్ద డబ్బులు లేవని చెప్పినా వినకుండా ఇబ్బంది పెట్టాడు. అతని బాధలు భరించలేక ఆమె ఈనెల 21వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తన తల్లి ఆచూకీ కనిపెట్టాలని కుమారుడు వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

సంబంధిత పోస్ట్