కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 3 ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అక్టోబర్ 31వ తేదీ దీపావళి కానుకగా అమలు చేస్తున్న సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మొహమ్మద్ నసిర్ టపాసులు కాల్చి, స్వీట్స్ పంచిపెట్టారు. శుక్రవారం గుంటూరులో ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు పాల్గొన్నారు.