పిడుగురాళ్ల పట్టణంలోని 4వ వార్డు నందు పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి "ఎన్టీఆర్ భరోసా” పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇంటింటికి తిరిగి అర్హులైన వారికి వృద్ధాప్య, వితంతువు, వికలాంగుల "ఎన్టీఆర్ భరోసా” పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం దీపం -2 పథకం లబ్దిదారులకు గ్యాస్ సిలిండర్ ను పంపిణీ చేయటం జరిగింది.