నరసరావుపేట - గుంటూరు రహదారి మరమ్మత్తులు చేపట్టాలి

నరసరావుపేట నుంచి చిలకలూరిపేట మీదుగా గుంటూరు వెళ్లే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు వై. వెంకటేశ్వరరావు కోరారు. శనివారం వివిధ ప్రజాసంఘాల నాయకులు నరసరావుపేట నుండి గుంటూరు వెళ్ళు రహదారిని సందర్శించి రహదారిలో భారీ గుంతలు ఏర్పడి చిన్నపాటి వర్షానికే గుంతల్లో నీరు నిలిచి ప్రమాదకరంగా ఉందన్నారు. పాలకులు ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదని స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్