మంగళగిరి నియోజకవర్గం పెదవడ్లపూడికి చెందిన రైతులు మంగళవారం ఉండవల్లిలోని నివాసంలో జరిగిన ప్రజాదర్భర్ లో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. వైకాపా అండతో గ్రామంలోని ఉప్పలపాటి చెరువు కట్టను కొంతమంది ఆక్రమించారని, దీంతో వ్యవసాయ పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని ఫిర్యాదు చేశారు. ఆక్రమణలు తొలగించి రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.