మంగళగిరి: విద్యార్థి వరుణ్ తేజ్ మృతిపై మంత్రి విచారం

దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి చదివే విద్యార్థి వరుణ్ తేజ్ చెరువుకు ఈతకు వెళ్లి దుర్మరణం చెందడంపై మంత్రి సవిత విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం మంగళగిరిలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థి మరణం ఎంతో బాధాకరమన్నారు. విద్యార్థి తల్లిదండ్రులకు తన సానుభూతిని తెలిపి, కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. ఘటనపై దర్యాప్తు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్