టీడీపీ, జనసేన నేతలు, మహిళా నేతల ఫొటోలని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాల్లో పోస్ట్ చేసే వ్యక్తిని శనివారం అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. మంగళగిరి డీఎసీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మొండోరాకి చెందిన వైసీపీ సోషల్ మీడియా వింగ్ ప్రతినిధి అశోక్ రెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు.