కట్టుడు పళ్ల వైద్యం అనేది వ్యక్తుల జీవితానికి గౌరవ నూతన ఉత్తేజం ఇస్తుందని ఇండియన్ ప్రోస్టో డాంటిక్ సొసైటీ జాతీయ కార్యదర్శి హరి అన్నారు. బుధవారం మంగళగిరి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక వైద్యులు నిపుణుల ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణమోహన్, భవన్ చంద్ ఉన్నారు.