ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరించడానికి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. బుధవారం ఉండవల్లి నివాసంలో లోకేశ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలతో పాటు రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు వారి సమస్యలను వినతుల రూపంలో మంత్రికి అందజేశారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.