తాడేపల్లి: భూ పోరాటానికి పిలుపునిచ్చిన సీపీఎం

తాడేపల్లి మండలం బ్రహ్మానందపురం గ్రామంలోని ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ బాధితుల ఆందోళన తీవ్రమైంది. సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులు భూ ఆందోళనకు పిలుపునివ్వగా ఆదివారం సీపీఎం పార్టీ నాయకులు మద్దతిచ్చారు. బాధితులను నష్ట పరిహారం ఇవ్వాలని గతంలో కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ నష్ట పరిహారం ఇవ్వకపోవడంతో బాధితులు భూ పోరాటానికి పిలుపునిచ్చారు. ఫ్యాక్టరీకి సంబంధించిన భూమిలో బాధితులు ఇళ్ల స్థలాలను ఏర్పాటు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్