తాడేపల్లి లోని ఓ సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులకు సీపీఎం నాయకులు ఆదివారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు సిపిఎం నాయకులు మాట్లాడుతూ సామాన్య ప్రజలు ఉపాధి లేక అలమటిస్తుంటే ప్రభుత్వాలు నిత్యవసర సరుకులపై ధరలు పెంచుకుంటూ వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమిలి ఎన్నికల పేరుతో రాష్ట్రాల హక్కులను బీజేపీ ప్రభుత్వం కాలరాస్తుందన్నారు.